రాష్ట్రంలో 87 వేల మంది HIV రోగులు: ప్రసన్న కుమారి

రాష్ట్రంలో 87 వేల మంది HIV రోగులు: ప్రసన్న కుమారి

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 87వేల మంది హెచ్.ఐ.వి సోకిన వ్యాధి గ్రస్తులు ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అడిషనల్ డైరెక్టర్ ప్రసన్న కుమారి తెలిపారు. వారు మందులు వాడుతున్నారన్నారు. అలాగే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వారి రక్తంలో  వైరస్ ఎంత ఉందో పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కోఠిలోని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు  చేశారు. గతంలో కంటే పవర్ ఫుల్ మందులు అందుబాటులోకి వచ్చాయని... క్రమం తప్పకుండా మందులు వాడే వారు గతం కంటే ఎక్కవ కాలం బ్రతుకుతున్నారని స్పష్టం చేశారు. అలాగే ఎయిడ్స్ సోకిన వారి మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. 10ఏళ్ల లో మరణాల సంఖ్య తగ్గించడంతో పాటు... కొత్త కేసులు కూడా తగ్గాయన్నారు. 

హోమియో మందులు రోగ నిరోధక శక్తి పెంచేవే తప్ప వైరస్ ను చంపవని ప్రసన్న కుమారి చెప్పారు. తాము ఇచ్చే మందులు చంపవుకాని, వైరస్ ను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణకు మెడిసిన్స్ ఉన్నాయని కొంతమంది రోగులను తప్పుదోవపట్టిస్తున్నారన్న ఆమె... కానీ తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుండి ఏ మెడిసిన్ కు అప్రూవల్ రాలేదని తేల్చి చెప్పారు. వారు అమ్మే మందులు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందే గానీ... వ్యాధి పూర్తిగా నయం కాదని చెప్పారు. రేపు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రేపు సొసైటీ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్ర నుండి ఆర్టీసీ కళాభావన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి... అనంతరం సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొననున్నట్లు వివరించారు.