నిమ్స్ నిర్వాకం.. సర్జరీ చేయకున్నా చేసినట్టు డిశ్చార్జ్ రిపోర్ట్

నిమ్స్ నిర్వాకం.. సర్జరీ చేయకున్నా చేసినట్టు డిశ్చార్జ్ రిపోర్ట్

నిమ్స్ హాస్పిటల్ లో కొందరు డాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పేషెంట్స్ తో ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజులు కట్టించి... వాటిని దోచుకుంటున్నారని విమర్శిస్తున్నారు పేషెంట్ల బంధువులు. వెంకట్రావ్ అనే క్యాన్సర్ బాధితుడు ట్యూమర్ తొలగించాలంటూ నిమ్స్ లో చేరాడు. పరీక్షించిన న్యూరో సర్జన్ వంశీకృష్ణ... సర్జరీకి ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ కూడా రావాలని చెప్పారు. ఇందుకోసం 45 వేలు చెల్లించాలని చెప్పారంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. పంజాగుట్టలోని ఏషియన్ హాస్పిటల్ లో డబ్బులు కట్టి రావాలని చెప్పడంతో అలానే కట్టామని...తీరా సర్జరీ సమయంలో ప్రైవేట్ డాక్టర్ రాకపోవడంతో సర్జరీ ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో చేరినా...జనరల్ అడ్మిషన్ గా మార్చి డబ్బులు కట్టాలంటూ డిశ్చార్జ్ టైంలో 17వేలు కట్టించుకున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నించినా... నిమ్స్ డైరెక్టర్ చూసిచూడనట్టుగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.