
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహబూబ్నగర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మందుస్తు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న ఉదయం 11: 20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 2:15 గంటల వరకు హైదరాబాద్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:25 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 3:05 గంటలకు మహబూబ్ నగర్ చేరుకుంటారు. అయితే తాజా షెడ్యూల్ ప్రకారం.. బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాక డైరెక్ట్ గా మహబూబ్ నగర్ చేరుకుంటారు. హైదరాబాద్ లో ఎక్కడా ఆగకుండా డైరెక్టుగా మహబూబ్ నగర్ చేరుకుంటారు. మోదీ షెడ్యూల్ ను పీఎంవో రిలీజ్ చేసింది.