క్యాన్సర్ కు మందు లేదు .. ముందు జాగ్రత్తలే బెస్ట్ : అనుదీప్​

క్యాన్సర్ కు మందు లేదు .. ముందు జాగ్రత్తలే బెస్ట్ :  అనుదీప్​

హైదరాబాద్​, వెలుగు: క్యాన్సర్ కు మందు లేదని, జబ్బు  రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలే ఉత్తమమని, 30 ఏండ్లు దాటిన ప్రతి మహిళ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య విభాగం ఎంఎన్ జే క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ టీమ్ సహకారంతో  బుధవారం కలెక్టరేట్ లోని మహిళా ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును  స్నేహ జూబ్లీ బ్లాక్ లో నిర్వహించగా.. ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.  కలెక్టర్ మాట్లాడుతూ... గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ పై కుటుంబ సభ్యులు, బంధువులకు, శ్రేయోభిలాషులకు అవగాహన కల్పించాలని సూచించారు. భవిష్యత్ లో ఇలాంటి క్యాంపులు జిల్లా అంతటా నిర్వహిస్తామని చెప్పారు. అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నిర్మలా ప్రభావతి, ఎంఎన్ జే క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ జయలత, గైనిక్ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ లీల, డాక్టర్ శాలిని, డాక్టర్ స్వప్న, స్ట్రిక్  ప్రోగ్రాం ఆఫీసర్ నాగరాజు, సంకేత్  పాల్గొన్నారు.

మాస్​ కాపీయింగ్​ జరగకుండా చూడాలి

ఇంటర్ ఎగ్జామ్స్​సజావుగా  జరిగేలా చూడాలని, విద్యార్థులు మాస్​ కాపీయింగ్ కు పాల్పడకుండా ఇన్విజిలేటర్లు కఠినంగా వ్యవహరించాలని  కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ఇంటర్మీడియట్ ఫైనల్ ​ఎగ్జామ్స్​లో భాగంగా బుధవారం సైఫాబాద్ సెక్రటేరియట్ ఎదురుగా  సహారా కాంప్లెక్స్ లోని ఫిట్జీ( fiitjee) కాలేజీలోని ఎగ్జామ్​ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.  సెంటర్​లో విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును చూసి.. రిజిస్టర్లను తనిఖీ చేశారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దాసరి ఒడ్డెన్న, విద్యాశాఖ అధికారులు ఉన్నారు.