న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ముందు మెగా ఆక్షన్‌ను నిర్వహించాలనుకున్న బీసీసీఐ.. ప్రస్తుతానికి దానిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. 2022లో రెండు కొత్త జట్లు వచ్చిన తర్వాత పూర్తిస్థాయి మెగా ఆక్షన్‌ను కండక్ట్ చేయాలని ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. అయితే ఐపీఎల్–14 అవసరాలకు తగినట్లుగా మిడ్ ఫిబ్రవరిలో మినీ ఆక్షన్ నిర్వహించాలని భావిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై బీసీసీఐ ఏజీఎమ్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ‘నెక్స్ట్ ఇయర్ ఫుల్ ఆక్షన్ సాధ్యం కాదు. ఎందుకంటే కొత్త టీమ్స్‌తో పాటు మరికొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ముందుగా వాటిని పరిష్కరించాలి. అయితే కొంత మంది కొత్త ప్లేయర్ల కోసం మినీ ఆక్షన్‌ను కండక్ట్ చేస్తాం. దీనికి సంబంధించిన తేదీలు, వేదికను ఖరారు చేయాల్సి ఉన్నా.. ఫిబ్రవరిలో జరిగే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించాడు. అయితే మినీ ఆక్షన్‌పై ముంబై ఇండియన్స్ సంతృప్తి వ్యక్తం చేయగా, లాస్ట్ సీజన్లో చెత్తగా ఆడిన చెన్నై సూపర్‌కింగ్స్ మాత్రం నిరాశలో పడిపోయింది.

