పార్లమెంట్ ప్రాంగణంలో కొనసాగుతోన్న విపక్ష ఎంపీల రిలె దీక్ష

పార్లమెంట్ ప్రాంగణంలో కొనసాగుతోన్న విపక్ష ఎంపీల రిలె దీక్ష

సస్పెన్షన్లకు నిరసనగా పార్లమెంటు ప్రాంగణంలోనే 20 మంది రాజ్యసభ ఎంపీలు రిలే దీక్షకు దిగారు. రాత్రుళ్లు కూడా అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. దీక్ష చేస్తున్న ఎంపీలకు ఫుడ్, ఇతర ఏర్పాట్లను ప్రతిపక్షాలు చూస్తున్నాయి. విపక్షాలకు చెందిన కొంతమంది సభ్యుల సస్పెన్షన్ పై నిన్న ఉభయసభల సమావేశాల్లో చర్చించారు. మిస్ బిహేవియర్ పై విచారం వ్యక్తం చేసినట్లయితే సస్పెన్షన్ ఎత్తివేతను పరిశీలిస్తామని తెలిపింది కేంద్రం. ఈనెల 25న లోక్ సభలో నలుగురు, ఈనెల 26న రాజ్యసభలో 19 మంది సభ్యులు సస్పెండ్ కాగా.. రాజ్యసభలో ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్ పైనా వేటు పడింది.

రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుతో మల్లికార్జున ఖర్గే సహా 10 మందివ విపక్ష నతేలు భేటీ అయి, సస్పెన్షన్లు తొలగించాలని కోరారు. బేషరతుగా సస్పెన్షన్ ను ఎత్తివేస్తే మంచిదని సూచించారు. చేసిన తప్పును సభ్యులు ఒప్పుకుంటేనే స్సపెన్షన్లు ఎత్తివేస్తామని ఛైర్మన్ స్పష్టం చేశారు. దానికి నేతలెవరూ అంగీకరించలేదు.

క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని టీఎంపీ ఎంపీ మౌసమ్ నూర్ స్పష్టం చేశారు. ధరల పెరుగుదలపై పార్లమెంటులో చర్చలు జరపాలనుకున్నాం కానీ మమ్మల్ని సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీల 50 గంటల సుదీర్ఘ నిరసన బయట కొనసాగుతుందన్నారు. ప్రతిపక్ష ఎంపీలు క్షమాపణ చెబితే సస్పెన్షన్‌ను రద్దు చేయవచ్చని ప్రహ్లాద్ జోషి చేసిన ప్రకటనపై TMC ఎంపీ మౌసమ్ నూర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.