ప్రధాని సీటు ఖాళీగా లేదు : ధర్మేంద్ర ప్రధాన్

ప్రధాని సీటు ఖాళీగా లేదు : ధర్మేంద్ర ప్రధాన్

ప్రధాని అయ్యేందుకు మమతా బెనర్జీకి అన్ని అర్హతలు ఉన్నాయన్న ఇటీవల ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ చేసిన వ్యాఖ్యలకు ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో ప్రధాని పోస్టు ఖాళీగా లేదని సటైర్ వేశారు. కోల్ కతాలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు ఈసారి కూడా మోడీవైపే ఉన్నారని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. పేద, గ్రామీణ ప్రజలు, యువత దేశాన్ని నడిపించే బాధ్యతను మోడీపై ఉంచారని, 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎన్డీఏ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉంటాయనుకోవడం పొరపాటేనని నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్ ఇటీవల అన్నారు. రానున్న ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే మమతా బెనర్జీకి తదుపరి ప్రధాని అయ్యే సామర్థ్యం ఉందని చెప్పారు.