20 మంది స్టూడెంట్లకు ఒక్కరే టీచర్

20 మంది స్టూడెంట్లకు ఒక్కరే టీచర్

చెన్నూర్,వెలుగు: మండలంలోని బుద్దారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 20 మంది స్టూడెంట్లకు ఒక్కరే టీచర్​ ఉన్నారు. టీచర్​ వెంకటేష్ రాష్ర్ట విద్యాశాఖ ప్రవేశపెట్టిన 'తొలిమెట్టు' కార్యక్రమంలో భాగంగా జూన్​ 30, 31, ఆగస్టు 1 తేదీల్లో మూడు రోజులు ట్రెయినింగ్​కు వెళ్లారు. రూల్స్​ ప్రకారం సింగిల్​ టీచర్​ లీవ్​ పెట్టినా, ట్రెయినింగ్​కు వెళ్లినా ఎంఈవో ముందస్తుగానే సమీపంలోని స్కూల్​ నుంచి మరొక టీచర్​ను అక్కడ నియమించాలి. వెంకటేష్​ స్థానంలో మూడు రోజులపాటు మరో టీచర్​ను బుద్దారం స్కూల్​లో నియమించినట్టు ఎంఈవో రాధాకృష్ణ చెప్పగా, అక్కడ ఎవరూ విధులు నిర్వహించడం లేదు. సోమవారం ఈ స్కూల్​కు తాళం ఉండగా, స్టూడెంట్లు ఇండ్ల దగ్గర ఆడుకుంటూ కనిపించారు. 'ఇయ్యాల సార్​ రాలే.. ఆయమ్మనే వంట చేసి మధ్యాహ్న భోజనం పెట్టింది' అని పిల్లలు చెప్పారు. డీఈవో స్పందించి పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్​ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు స్కూల్​ ఆవరణ అంతా బురదమయంగా మారింది. బడిలో పిల్లలకు దోమలు కుడుతున్నాయని తెలిపారు. టాయిలెట్స్ వాడే పరిస్థితి లేదు.