బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత..పలు వాహనాల అద్దాలు ధ్వంసం

బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత..పలు వాహనాల అద్దాలు ధ్వంసం

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ రూమ్ లో ఉరి వేసుకుని సురేష్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. సురేష్ ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సూసైడ్ కు గల కారణాలు తెలియరాలేదు. విద్యార్ధి ఆత్మహత్యతో  మిగతా స్టూడెంట్స్ ఆందోళనకు దిగడంతో ట్రిపుల్ ఐటీ లో ఉద్రిక్తత నెలకొంది. పలు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు తోటి విద్యార్థులు. విద్యార్థి మృత దేహాన్ని పోలీసులు భైంసా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి స్వస్థలం నిజామాబాద్ జిల్లా.

విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా అధికారులు పట్టించుకోలేదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. సురేష్ చనిపోయి గంటసేపు అయినా అంబులెన్స్ కోసం ఎవ్వరూ ఫోన్ చేయలేదని.. ఆస్పత్రికి తరలించేందుకు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.