కేబినెట్ తీర్మానంలో మార్పులు జరగొచ్చు

కేబినెట్ తీర్మానంలో మార్పులు జరగొచ్చు
  • రూల్స్​ ప్రకారం కేబినెట్ నిర్ణయం రహస్యం
  • అది మధ్యలో ఉండగాన్యాయ సమీక్షకు చాన్స్​ లేదు
  • హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, వెలుగు: ఆర్టీసీకి చెందిన 5,1 00 రూట్లలో ప్రైవేటు పర్మిట్లు జారీ చేసేందుకు నవంబర్‌ 2న కేబినెట్ చేసిన తీర్మాన ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాలేదని,ఆదేశాలు జారీ చేసేలో గా అందులో మార్పులు చేర్పులు జరగొచ్చని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు
ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ ఎస్ కే జోషి శనివారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేటుకు అప్పగించడాన్ని సవాల్‌ చేస్తూ ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిల్ పై విచారించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల ఆదేశించిం ది. సెక్రటేరియట్ రూల్స్​ప్రకారం కేబినెట్ నిర్ణయం రహస్యమని, రూల్ 166(1) ప్రకారం రాజ్యాంగ ప్రక్రియ పూర్తి కాకుండా హైకోర్టులో సవాల్‌ చేయరాదని అఫిడవిట్ లో సీఎస్ స్పష్టం చేశారు. కేబినెట్ తీర్మానాలు సెక్రటేరియట్నోట్ ల్స్ లో భాగమని, వీటిని బహిర్గతం చేయరాదని, కేబినెట్ తీర్మానా లను చట్టప్రకారం అమలు చేయాల్సిన బాధ్యత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి తదితర అధికారులపై ఉందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి న కొత్త రవాణాచట్టం ప్రకారం జీవో జారీ కాకుండా సవాల్ చేయడానికి వీల్లేదన్నారు. సెక్షన్‌ 102 ప్రకారం
ముందుగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చా కజనం నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని,ఆపై గెజిట్‌ నోటి ఫికేషన్‌ జారీ అవుతుందని,చివరిగా జీవో వస్తుందని చెప్పారు. కేబినెట్ నిర్ణయం మధ్యలో నే ఉండగా న్యాయ సమీక్షకు అవకాశం లేదన్నారు.