దూలపల్లిలో అగ్ని ప్రమాదం

 దూలపల్లిలో అగ్ని ప్రమాదం

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పేట్ బాషీరాబాద్ పియస్ పరిధిలోని దూలపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.బి ఆర్ ఎస్ ప్లాస్టిక్ సంచులు తయారుచేసే కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ డిపార్ట్ మెంట్ సిబ్బంది..మంటలను అదుపు చేశారు. మరోవైపు షార్ట్ సర్క్యూట్ వల్ల  అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. కంపెనీకి సెలవు కావడంతో..ప్రాణ నష్టం జరగలేదని పేట్ బషీరాబాద్ ఎస్ఐ రామ్ నారాయణ వెల్లడించారు.