ఫంక్షన్ హాల్ సంపులో పడి బాలుడు మృతి.. శంషాబాద్​లో ఘటన

ఫంక్షన్ హాల్ సంపులో పడి బాలుడు మృతి.. శంషాబాద్​లో ఘటన
  • శంషాబాద్​లో ఘటన 

శంషాబాద్. వెలుగు : ఫంక్షన్ హాల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా బాలుడు చనిపోయిన ఘటన సంఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నందిగామకు చెందిన శ్రీకాంత్ రెడ్డి కుటుంబం బుధవారం శంషాబాద్ పరిధి మై ఫెయిర్ ఫంక్షన్ హాల్ లో జరిగే పెళ్లికి హాజరైంది. శ్రీకాంత్ రెడ్డి కుమారుడు అభిజిత్ రెడ్డి (7) ఫంక్షన్ హాల్ కనిపించకపోయేసరికి  వెతికినా జాడ దొరకలేదు. తన కుమారుడు తప్పిపోయాడని సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు శ్రీకాంత్ రెడ్డి కంప్లయింట్ చేశాడు. 

పోలీసులు ఫంక్షన్ హాల్ పరిసరాలతో పాటు డ్రైనేజీ సంపును పరిశీలించగా అందులో అభిషేక్ రెడ్డి శవమై కనిపించాడు. మృతదేహాన్ని బయటకు తీసి గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. తన కొడుకు మృతికి ఫంక్షన్ హాల్ యాజమాన్యమే కారణమని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించాడు. డ్రైనేజీ సంపు పై కప్పు లేకపోవడంతో అందులో పడి బాలుడు మృతి చెందాడని ఫంక్షన్ హాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. 

డ్రైనేజీ సంపు వద్ద ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫంక్షన్ హాల్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసు నమోదు చేస్తామని శంషాబాద్ ఏసీపీ రామచంద్రరావు తెలిపారు.