
ఈ రోజుల్లో చాలామంది వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వర్కింగ్ అవర్స్ కూడా పెరిగాయి. దీంతో ఇంట్లో కూడా కొందరికి రెస్ట్ తీసుకునే టైమ్ దొరకడం లేదు. ఇలాంటప్పుడు రిలాక్స్ అవ్వడం కష్టమైపోతుంది. రోజంతా అలసినట్లే అనిపిస్తోంది. అయితే రోజులో ఉన్న తక్కువ టైమ్‌లోనే బాడీకి రిలాక్సింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే కొన్ని టూల్స్ అందుబాటులో ఉన్నాయి.వాటిని వాడితే మంచి లాభం ఉంటుంది. ఆన్‌లైన్‌లో వీటిని కొనుక్కోవచ్చు.
నెక్ పిల్లో
చైర్‌లో ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల మెడ పట్టేసినట్లుగా ఉంటుంది. ఇలాంటప్పుడు మెడనొప్పి తగ్గాలంటే నెక్‌పిల్లో వాడొచ్చు. కుర్చీలో కూర్చుని నెక్‌పిల్లో వాడితే రిలాక్సింగ్‌గా ఉంటుంది. తలకు, మెడకు ఎలాంటి ఒత్తిడి కలిగించకుండా మెత్తగా ఉంటుంది ఈ పిల్లో.
బబుల్ డోర్‌మ్యాట్
రోజంతా ఇంట్లోనే ఉండటం వల్ల కూడా అలసటగా అనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బయటికెళ్లి టైమ్ స్పెండ్ చేసే అవకాశం లేదు. ఇలాంటప్పుడు ఇంట్లోనే కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వాటిలో ‘బబుల్ డోర్‌మ్యాట్’ ఒకటి. రెగ్యులర్ డోర్ మ్యాట్స్‌కు బదులు ఇవి వాడితే చాలా మంచిది. ఈ డోర్ మ్యాట్స్‌పైన బబుల్స్ లాంటివి ఉంటాయి. వీటిపైన పాదాలు ఉంచితే, మెల్లిగా ఒత్తిడి కలిగించి పాదాలు రిలాక్స్ అయ్యేలా చేస్తాయి.
జెల్ ఐ మాస్క్
ఎక్కువసేపు ల్యాప్‌టాప్, కంప్యూటర్ వంటి డిజిటల్ స్క్రీన్స్‌పై పనిచేయడం వల్ల కళ్లు చాలా అలసిపోతాయి. దీనివల్ల తలనొప్పి, యాంగ్జైటీ, నిద్రలేమి వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా రిలాక్సింగ్ జెల్ ఐ మాస్క్ వాడాలి. కళ్లపై ఈ మాస్క్ పెట్టుకుంటే చాలా కూల్‌గా, రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది.
ఫుట్ రెస్ట్ స్టూల్
చైర్ లేదా సోఫాలో కూర్చున్నప్పుడు పాదాలు కూడా రిలాక్స్ అవ్వాలంటే ఫుట్ రెస్ట్ స్టూల్ వాడాలి. బీన్ బ్యాగ్స్‌లో ఇలాంటివి దొరుకుతున్నాయి. ఎక్కువసేపు పనిచేసి అలసిపోయినప్పుడు వీటిపై కాళ్లు చాపి రిలాక్స్ అవ్వొచ్చు.
అరోమా ఆయిల్ డిఫ్యూజర్
వర్క్ చేసే గదిలో అరోమా ఆయిల్ డిఫ్యూజర్ ఉంచుకుంటే, మంచి సువాసన రిలాక్సింగ్ మూడ్ అందిస్తుంది. బ్రెయిన్ కూడా యాక్టివ్‌గా పనిచేస్తుంది.
గ్లాసెస్ డిజిటల్ స్క్రీన్స్ నుంచి కలిగే ఒత్తిడిని తగ్గించేందుకు, కళ్లపై ఎక్కువ భారం పడకుండా ఉండేందుకు కళ్లద్దాలు వాడాలి. కంప్యూటర్ గ్లాసెస్ అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయి. ఇవి స్క్రీన్స్‌పై నుంచి వచ్చే బ్లూ రేస్ ఎఫెక్ట్‌ను కూడా తగ్గిస్తాయి.
గ్రీన్ టీ
వర్క్ చేసేటప్పుడు రెగ్యులర్ టీ, కాఫీల బదులు గ్రీన్ టీ తాగితే చాలా ప్రయోజనం ఉంటుంది. ఇవి ఎనర్జీ ఇచ్చి, మంచి మూడ్ క్రియేట్ చేస్తాయి. ఒంట్లోని మలినాల్ని తొలగిస్తాయి. వర్క్ చేసేటప్పుడు కనీసం ఒకటి లేదా రెండు గ్రీన్ టీలు తాగితే మంచిది.
హాట్ వాటర్ బ్యాగ్
ఎక్కువసేపు పనిచేసి బాడీ అలసినట్లుగా అనిపిస్తే హాట్ వాటర్ బ్యాగ్‌తో కాపడం పెట్టుకుంటే, బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. అందుకే మార్కెట్లో దొరికే హాట్ వాటర్ బ్యాగ్స్ వాడాలి. చార్జింగ్ ద్వారా ఇందులోని నీళ్లు వేడవుతాయి. ఈ బ్యాగ్‌ను కావాల్సిన ప్లేస్‌లో ఉంచుకుంటే రిలాక్స్ అవ్వొచ్చు.