ఈ వారం స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభావితం చేసే అంశాలు ఇవే..

ఈ వారం స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభావితం చేసే అంశాలు ఇవే..

న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గ్లోబల్ ట్రెండ్స్, విదేశీ పెట్టుబడిదారుల ట్రేడింగ్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటా ప్రభావితం చేయనున్నాయని ఎనలిస్టులు  తెలిపారు. గత వారం మార్కెట్లు ఒక శాతం పైగా లాభంతో ముగిశాయి. ఈ నెల 12న ఇండియా ఆగస్టు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్  డేటా వెలువడనుంది. అమెరికాలో కన్స్యూమర్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్, జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ క్లెయిమ్స్, కన్స్యూమర్ సెంటిమెంట్ వంటి అంశాలు ఫెడ్  విధానంపై ప్రభావం చూపుతాయి.

వీటి డేటా ఆధారంగా ఈ నెల 16–17 న జరిగే ఫెడ్  పాలసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్ణయం వెలువడనుంది.  ఇండియా, యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేడ్ డీల్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్లు కూడా మార్కెట్ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభావితం చేయొచ్చు. కిందటి వారం బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ సెన్సెక్స్  901 పాయింట్లు, నిఫ్టీ 314 పాయింట్లు లాభపడగా, ఈ వారం కన్సంప్షన్, క్యాపిటల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెండిచర్ రంగాలపై దృష్టి ఉండనుంది. క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి- డాలర్ మార్పిడి కూడా కీలకం. జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ  రేట్ల తగ్గింపు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఊపునివ్వగలదని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.