లాక్ డౌన్ గైడ్ లైన్స్ ఇవే..

లాక్ డౌన్ గైడ్ లైన్స్ ఇవే..

హైద‌రాబాద్- మే-12 నుంచి ప‌ది రోజుల పాటు తెలంగాణ‌లో లాక్ డౌన్ అమ‌లు చేసిన ప్ర‌భుత్వం ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది.  వ్య‌వ‌సాయ‌, వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌కు మిన‌హాయింపు నిచ్చారు. ధాన్యం కొనుగోళ్ల‌ను య‌థావిధిగా కొన‌సాగించాల‌ని కేబినేట్ నిర్ణ‌యం తీసుకుంది. అలాగే ఉపాధి హామీ ప‌నులు కూడా య‌థావిధిగా చేసుకోవ‌చ్చ‌ని, వైద్య రంగం, విద్యుత్, మీడియాకు లాక్ డౌన్ నుంచి మిన‌హాయింపు ఉంద‌ని తెలిపింది. నేష‌న‌ల్ హైవేల‌పై పెట్రోల్ బంకుల‌కు అనుమ‌తి ఉంది. 33 శాతం ఉద్యోగుల‌తో ప్ర‌భుత్వ ఆఫీసులు ప‌ని చేస్తాయి. ఉ.6-10 వ‌ర‌కే మెట్రో ఆర్టీసీ..ఇత‌ర రాష్ట్రాల‌కు బ‌స్సులు బంద్. అంత్య‌క్రియ‌ల‌కు 20 మంది..పెళ్లిళ్ల‌కు 40 మందికి అనుమ‌తి. థియేట‌ర్స్, జిమ్ లు, స్విమ్మింగ్ ఫూల్స్ బంద్. బ్యాంకులు, వంట‌ గ్యాస్ సేవ‌లు ప‌ని చేస్తాయి. లాక్ డౌన్ కొన‌సాగింపుపై మే-20న మ‌రోసారి కేబినేట్ భేటీ కానుంది.