మెహిదీపట్నం, వెలుగు: సంక్రాంతికి నెల రోజుల ముందే సిటీని చైనా మాంజా వణికిస్తుంది. నిషేధం ఉన్నప్పటికీ సింథటిక్, చైనా మాంజా అమ్మకాలు, వాడకం యథేచ్చంగా సాగుతోంది. తాజాగా మంగళహాట్ ప్రాంతంలో అక్రమంగా చైనా మాంజా విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
జెన్సీ చౌరస్తా మంగళహాట్ ప్రాంతానికి చెందిన రన్వీర్ సింగ్, వివేక్ సింగ్ అక్రమంగా చైనా మాంజా విక్రయిస్తున్నట్టు సమాచారం రావడంతో మంగళహాట్ పోలీసులు మంగళవారం దాడులు చేశారు. వీరి నుంచి 132 బాబిన్ల మాంజాను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.32 లక్షల వరకు ఉంటుందని సీఐ మహేశ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
