జులైలో చూడదగ్గ ప్రదేశాలివే..

జులైలో చూడదగ్గ ప్రదేశాలివే..

చాలామంది సమ్మర్‌‌‌‌‌‌‌‌లో టూర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌ చేసుకుని ఉంటారు. కానీ, కరోనా వల్ల ఆ ప్లాన్స్‌‌‌‌ వర్కవుట్‌‌‌‌ కాలేదు. ఇప్పుడు కరోనా సెకండ్‌‌‌‌వేవ్‌‌‌‌ పూర్తైంది. పైగా వ్యాక్సినేషన్‌‌‌‌ కూడా నడుస్తోంది. ఇప్పుడు ఏదైనా టూర్‌‌‌‌‌‌‌‌ వెళ్దామనుకునేవాళ్లు కొన్ని డెస్టినేషన్స్‌‌‌‌ సెలక్ట్‌‌‌‌ చేసుకోవచ్చు. ఈ వర్షాకాలం.. అందులోనూ జులైలో చూడదగ్గ ప్రదేశాలు ఇవి. వ్యాక్సిన్‌‌‌‌ తీసుకుని, తగిన జాగ్రత్తలతో వెళ్లాలనుకునేవాళ్లకు ఇవి మంచి ఛాయిస్‌‌‌‌.

వ్యాలీ ఆఫ్‌‌‌‌ ఫ్లవర్స్‌‌‌‌

మన దేశం నుంచి యునెస్కో గుర్తించిన టూరిస్ట్‌‌‌‌ అండ్‌‌‌‌ హిస్టారికల్ ప్లేస్‌‌‌‌ ‘వ్యాలీ ఆఫ్‌‌‌‌ ఫ్లవర్స్‌‌‌‌ నేషనల్‌‌‌‌ పార్క్‌‌‌‌’. ఉత్తరాఖండ్‌‌‌‌లోని చమోలి–పితోర్​గఢ్​ మధ్యలో ఉంటుంది. ఈ ప్రదేశానికి వెళ్లేందుకు జులై నెల బెస్ట్‌‌‌‌. సముద్రమట్టానికి 3,858 మీటర్ల ఎత్తులో.. అందమైన పర్వతాలు, పూల తోటలతో ఆహ్లాదాన్ని పంచుతుంది ‘వ్యాలీ ఆఫ్‌‌‌‌ ఫ్లవర్స్‌‌‌‌’. హేమకుంట సాహిబ్‌‌‌‌, భీమ్‌‌‌‌ పూల్‌‌‌‌, సరస్వతి నది వంటివి ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు. 

ట్రెక్కింగ్‌‌‌‌కు వెళ్లాలనుకునేవాళ్లకు కూడా బెస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌. పర్వతాలపై పచ్చగా ఎదిగిన పూలమొక్కల మధ్య ట్రెక్కింగ్‌‌‌‌ చేయడం మంచి అనుభూతిని అందిస్తుంది. ఈ నెలలో విరబూసే రంగురంగుల పూలను చూస్తూ సేదతీరొచ్చు. డెహ్రాడూన్‌‌‌‌, హరిద్వార్‌‌‌‌‌‌‌‌ నుంచి విమానంలో కాని, రైల్లో కాని చేరుకోవచ్చు. హోటల్స్‌‌‌‌ అందుబాటులో ఉన్నాయి.

స్పితి వ్యాలీ

అందమైన రాతి పర్వతాలు, వాటి మధ్యలోంచి పారే మంచు నదులు.. స్పితి వ్యాలీ ప్రత్యేకత. పర్వత ప్రాంతాల్ని ఇష్టపడేవాళ్లకు బాగా నచ్చుతుంది కనుక దీన్ని ‘మక్కా ఆఫ్‌‌‌‌ మౌంటైన్‌‌‌‌ లవర్స్‌‌‌‌’ అని కూడా పిలుస్తారు. బుద్ధిజానికి సంబంధించిన సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది. ఈ కల్చర్‌‌‌‌‌‌‌‌ను ప్రతిబింబించే చిన్న టెంపుల్స్‌‌‌‌, గ్రామాలు ఉన్నాయి. రాతి పర్వతాల్ని చీలుస్తూ వేసిన రోడ్లపై ప్రయాణం అడ్వెంచరస్‌‌‌‌గా అనిపిస్తుంది. ‘కీ మానస్టరీ, టాబో మానస్టరీ, బారా–షిగ్రీ గ్లేసియర్ వంటివి ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు. జీప్‌‌‌‌ సఫారి, ట్రెక్కింగ్‌‌‌‌కు అనుకూలమైన ప్లేస్‌‌‌‌ ఇది. ఈ నెలలో టూరిస్ట్‌‌‌‌లు వెళ్లగలిగే మంచి స్పాట్‌‌‌‌ ఇది. కుల్లూ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ నుంచి విమాన సదుపాయం ఉంది. సిమ్లా రైల్వే స్టేషన్‌‌‌‌ నుంచి కూడా చేరుకోవచ్చు.

షిల్లాంగ్‌‌‌‌

ఈ నెలలో విజిట్‌‌‌‌ చేయాల్సిన మరో బెస్ట్ టూరిస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ షిల్లాంగ్‌‌‌‌. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌‌‌‌ ఈశాన్య భారతదేశంలోని అందమైన ప్రదేశాల్లో ఒకటి. చుట్టూ చిన్న చిన్న పర్వతాలు, సరస్సులతో నేచర్‌‌‌‌‌‌‌‌ లవర్స్‌‌‌‌కు ఆహ్లాదాన్ని అందిస్తుంది షిల్లాంగ్‌‌‌‌. ఇది హిల్‌‌‌‌ స్టేషన్‌‌‌‌. పచ్చని ప్రకృతితో ఆకట్టుకునే ప్రదేశాల్లో వాకింగ్‌‌‌‌ చేస్తూ సేదతీరొచ్చు. నోకలికాయ్‌‌‌‌ ఫాల్స్‌‌‌‌, డాన్‌‌‌‌బాస్కో మ్యూజియమ్‌‌‌‌, ఉమియమ్‌‌‌‌ లేక్‌‌‌‌, ఎలిఫెంట్‌‌‌‌ ఫాల్స్‌‌‌‌తోపాటు వ్యూ పాయింట్‌‌‌‌ వంటి ఎన్నో ఆకట్టుకునే ప్రదేశా లున్నాయి. గౌహతి రైల్వే స్టేషన్‌‌‌‌తోపాటు చెన్నై, అహ్మదాబాద్‌‌‌‌, ఢిల్లీ నుంచి ఫ్లైట్స్‌‌‌‌ ద్వారా వెళ్లొచ్చు.

గుల్‌‌‌‌మార్గ్‌‌‌‌

జులైలో మంచు ప్రదేశాల్ని చూడాలనుకుంటే తప్పకుండా కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని గుల్‌‌‌‌మార్గ్‌‌‌‌ వెళ్లాల్సిందే. కొంచెం ఎండ.. తక్కువ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌తో మంచు వాతావరణాన్ని ఎంజాయ్‌‌‌‌ చేయొచ్చు. అడ్వెంచరస్‌‌‌‌ స్పోర్ట్‌‌‌‌ అయిన స్కీయింగ్‌‌‌‌కు కూడా ఫేమస్‌‌‌‌ ఇది. మంచు కరిగి పారుతున్న నదిని దగ్గరగా చూస్తూ, పర్వతాల నుంచి చల్లగా వీచే గాలి స్పర్శను అనుభూతి చెందుతూ గుల్‌‌‌‌మార్గ్‌‌‌‌ విజిట్‌‌‌‌ను మెమొరబుల్‌‌‌‌గా మార్చుకోవచ్చు. ఖిలాన్‌‌‌‌మార్గ్‌‌‌‌, అల్పతార్‌‌‌‌‌‌‌‌ లేక్​ వంటి మరెన్నో ప్లేసెస్‌‌‌‌ కూడా చూడొచ్చు. 
శ్రీనగర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు.