ఉక్కపోతకు తలుపులు తీస్తే..ల్యాప్ టాప్ లు లేపేసిండ్రు!

ఉక్కపోతకు తలుపులు తీస్తే..ల్యాప్ టాప్ లు లేపేసిండ్రు!
  • హాస్టల్ విద్యార్థులను టార్గెట్ చేసిన దొంగలు
  • పోచారం యమ్నాంపేటలో ఘటన

ఘట్​కేసర్, వెలుగు: వేసవిలో రాత్రి ఉక్కపోత తట్టుకోలేక హాస్టల్ గది తలుపులు తెరిచి నిద్రపోయిన విద్యార్థులను దొంగలు టార్గెట్ చేశారు. ఏకంగా 5 ల్యాప్​టాప్​లు, ఒక మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. పోచారం పరిధి యమ్నాంపేటలోని నిత్యశ్రీ బాయ్స్ హాస్టల్లో పలువురు శ్రీనిధి బీటెక్ కాలేజీ విద్యార్థులు ఉంటున్నారు. ఈ నెల 17న రాత్రి ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో రూమ్​తలుపులు తెరిచి నిద్రపోయారు.

ఇదే అదునుగా అర్ధరాత్రి 1:40 గంటల సమయంలో దొంగలు లోపలికి చొరబడ్డారు. ఆదిప్రణీత్, అతని రూమ్​మేట్ రంగా శ్రీఫణికి చెందిన రెండు ల్యాప్​టాప్​లతో పాటు, పైఅంతస్తులో ఉంటున్న అభిజిత్​కు చెందిన ల్యాప్​టాప్, మొబైల్ ఫోన్, నాగ ఆదిత్య, జశ్వంత్​కు చెందిన మరో రెండు ల్యాప్​టాప్​లను ఎత్తుకెళ్లారు. హాస్టల్లోకి దర్జాగా వస్తున్న దొంగల ఫొటోలు సీసీ ఫుటేజీలో రికార్డు కాగా, దాని ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.