హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయి తేజ్, వేద జలంధర్ జంటగా నటిస్తుండగా వి.మునిరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ మూవీ ట్రైలర్‌ను వెంకటేష్ రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘మా చిన్నతనంలో టీవీలో కొత్త సినిమా వచ్చినా, వీసీడీల్లో కొత్త మూవీ చూసినా ఎంతో హ్యాపీగా ఉండేది. అలాంటి హ్యాపీనెస్ ఇప్పటితరం వారికి చూపించాలనే అప్పటి హీరో, హీరోయిన్స్ గెటప్స్‌లో మీ ముందుకు వచ్చాం. చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు నాకు బాగా ఇష్టం.
అందుకే ఈ రోజు చెన్నకేశవరెడ్డి గెటప్‌లో వచ్చా. మా చిత్రంలో పనిచేసిన వాళ్లందరి కల సినిమా. ఆ కల తీరేందుకు ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ పట్టింది. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరికీ వేసవికి సమ్మర్ వెకేషన్ ఊరికి వెళ్లినట్లే ఉంటుంది. ఊరు, అప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి’ అని చెప్పాడు. లైఫ్‌లో చూసిన స్వీట్ మెమొరీస్ ఈ చిత్రంలో ఉంటాయని హీరో సాయి తేజ్ అన్నాడు. ట్రైలర్‌కు మించి సినిమా ఉంటుందని హీరోయిన్ వేద జలంధర్ చెప్పింది. డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ ‘అంతరించిపోతున్న మన కల్చర్, జ్ఞాపకాలు, టీవీ గురించి ఉండే ఎమోషన్స్‌ను ఇందులో చూస్తారు. 40 ఫ్లస్ ఏజ్ ఉన్నవాళ్లందరికీ ఈ చిత్రం ఒక ఎమోషన్’ అని చెప్పాడు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.
