
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీగా కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి నియమితులయ్యారు. మావోయిస్టు పార్టీలో నూతన బాధ్యతలు స్వీకరించారు తిరుపతి. నంబాల కేశవరావు మరణంతో ఖాళీగా ఉన్న పదవిలో తిరుపతిని నియమించారు. తిరుపతిని కొత్త మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా, హిడ్మాకు బస్తర్ బాధ్యతలు అప్పగించారు
మే 21న, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో సంస్థ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గగన్న, 28 మంది సహచరులతో కలిసి మరణించారు. నంబాల కేశవ్ రావు వారసుడిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేబూజీ ఎన్నికయ్యారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ దళిత నాయకుడు 1983లో పార్టీలో చేరాడు . పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర సైనిక కమిషన్ అధిపతిగా పనిచేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. 2010లో దంతెవాడలో జవాన్లపై దాడిలో తిరుపతి కీలకంగా ఉన్నాడు. ఇతనిపై కోటి రివార్డు ప్రకటించారు పోలీసులు.