మానేపల్లి జ్యువెల్లర్స్ లో మూడో రోజూ ఐటీ రైడ్స్ ..ఏటా రూ.వెయ్యి నుంచి 1250 కోట్ల లావాదేవీలు

మానేపల్లి జ్యువెల్లర్స్ లో మూడో రోజూ ఐటీ రైడ్స్ ..ఏటా రూ.వెయ్యి నుంచి 1250 కోట్ల లావాదేవీలు
  • ట్యాక్స్​ చెల్లింపుల్లో తేడా
  • జాప్యం ఉండడంతో రైడ్స్!
  • కొనుగోళ్లు, అమ్మకాల డాక్యుమెంట్ల పరిశీలన

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​మానేపల్లి జ్యువెల్లర్స్​లో మూడో రోజైన గురువారం కూడా ఐటీ రైడ్స్​కొనసాగాయి. ఐటీ లెక్కల్లో తేడాలు ఉన్నాయన్న విశ్వసనీయ సమాచారంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మూడు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్​లోని మానేపల్లి జ్యువెల్లర్స్​ లో ఏటా వెయ్యి నుంచి రూ.1.250 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయని ఐటీ అధికారులకు సమాచారం అందింది. వ్యాపార లావాదేవీల్లో కొనుగోలు, అమ్మకాలపై ట్యాక్స్​ల చెల్లింపు విషయంలో జాప్యం జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి మానేపల్లి జువెల్లర్స్​ లోని వ్యాపార లావాదేవీల డాక్యుమెంట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన కొనుగోళ్లు, అమ్మకాల వివరాలపై ఆరా తీస్తున్నారు.