నవంబర్ 8, 9న పౌర హక్కుల రాష్ట్ర మూడో మహాసభలు

నవంబర్ 8, 9న పౌర హక్కుల రాష్ట్ర మూడో మహాసభలు

బషీర్​బాగ్, వెలుగు: అటవీ సంపదను సామ్రాజ్య వాదులకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని తెలంగాణ పౌర హక్కుల సంఘం ఆరోపించింది. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసుల, మావోయిస్టులపై యుద్ధం చేస్తున్నదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, కార్యదర్శి నారాయణ అన్నారు. హైదర్ గూడ ఎన్ఎస్ఎస్​లో నిర్వహించిన సమావేశంలో సంఘం మూడో రాష్ట్ర మహా సభలకు సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు. 

నవంబర్ 8,9 తేదీల్లో రాష్ట్ర మహా సభలను బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలకు ఛత్తీస్ గఢ్​ఆదివాసుల హక్కుల కార్యకర్త సోనిసోరితో పాటు జస్టిస్ కోల్సే పాటిల్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొననున్నట్లు చెప్పారు. ‘ఆపరేషన్ కగార్​ను వ్యతిరేకిద్దాం.. జీవించే హక్కును కాపాడుదాం’ అనే నినాదంతో మహా సభలు జరుగుతాయన్నారు.