30 కంప్యూటర్స్ స్వాధీనం

30  కంప్యూటర్స్ స్వాధీనం
  •  నిందితులపై 50 కి పైగా కేసులు 

  హైదరాబాద్‌లో డిజిటల్ సేవల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఐజీఎస్ డిజిటల్ సర్వీస్ పేరుతో  ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  రైల్వే, విమాన సహా 300 రకాల సేవలు అందిస్తామని  చెప్పి ఐడీ కోసం రూ.1, 800లను బాధితుల నుంచి సైబర్ నేరగాళ్లు వసూలు చేశారు. తర్వాత కేవైసీ పేరుతో రూ.వేలను కాజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ లోని  జైపూర్  ప్రధాన కేంద్రంగా ఐజీఎస్ డిజిటల్ సెంటర్ కొనసాగుతోంది.

బాధితుడి ఫిర్యాదుతో  బేగంపేట వైట్‌హౌస్ భవనంలో ఉన్న ఐజీఎస్ కాల్ సెంటర్ పై  పోలీసులు దాడులు నిర్వహించారు.  సీఈవో ప్రతీక్ చావే, హెచ్‌ఆర్ స్వర్ణలత, శ్వవణ్ లాల్‌లను అరెస్ట్ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. వారి నుంచి దాదాపు 30  కంప్యూటర్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. సైబర్ క్రైమ్ పోర్టల్ లో వీరిపై 50 కి పైగా కేసులు ఉన్నాయని తెలిపారు.