ఇండియన్ నేవీ ఆపరేషన్ సక్సెస్.. 35 మంది సముద్ర దొంగలు అదుపులోకి

ఇండియన్ నేవీ ఆపరేషన్ సక్సెస్.. 35 మంది సముద్ర దొంగలు అదుపులోకి

సముద్రంలో భారత నౌకాదళం తన సత్తా చాటింది. సోమాలియా సముద్రపు దొంగలపై 40 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత భారత నౌకాదళం భారీ విజయాన్ని సాధించింది. ఇండియన్ నావీ యుద్ధనౌక INS కోల్‌కతాలో వెళ్లి సముద్ర దొంగలు హైజాక్‌ చేసిన MV Ruen వాణిజ్య నౌకను వారి చెర నుంచి విడిపించారు. 35 మంది సోమాలియా సముద్రపు దొంగలను అరేబియా సముద్రంలో అదుపులోకి తీసుకున్నారు. 

ఈ దొంగలు గత మూడు నెలలుగా కార్గో షిప్‌ను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. 17 మంది సిబ్బందిని కూడా ఎలాంటి గాయాలు లేకుండా రక్షించారు. దొంగలను అదుపులోకి తీసుకున్న తరువాత, యుద్ధ నౌక INS కోల్‌కతా ఇప్పుడు ముంబైకి చేరుకుంది. ఇండియన్ పీనల్ కోడ్ కింద చర్యలు తీసుకుని ఎల్లో గేట్ పోలీసులకు అప్పగిస్తారు.