నువ్వు గ్రేట్: పల్లీలు అమ్ముకుంటూ నెలకు 75వేలు సంపాదిస్తున్నాడా..!

నువ్వు గ్రేట్: పల్లీలు అమ్ముకుంటూ నెలకు 75వేలు సంపాదిస్తున్నాడా..!

అదోపూరి పాక..అదే అతని వ్యాపారానికి కేంద్రం..పెట్టుబడి కూడా చిన్నదే.. సాయంత్రం వేళల్లో బిజినెస్..ఆదాయం మాత్రం వేలల్లో.. అదేలా సాధ్యం అంటున్నా రా..సాధ్యమే అంటున్నారు బీహార్ కు చెందిన ఓ చిరువ్యాపారి..నెలకు 75 వేల రూపాయలు సంపదిస్తున్నాడంటా.. ఏం వ్యాపారం చేస్తున్నాడా.. పెట్టుబడి ఎంత.. ఎలా నిర్వహిస్తున్నాడో .. వివరాల్లోకి వెళితే.. 

బీహార్ లోని అరారియాలోని రాణిగంజ్ మార్కెట్..ఆ ప్రాంతంలో ఓ చిన్న గుడిసెలో సికిందర్ అనే చిరువ్యాపారి దుకాణం నిర్వహిస్తున్నాడు.. కాల్చిన చుర, పప్పు, బాదం, మూంగ్, మొక్కొజొన్న, ఉల్లిపాయలు, మిర్చి కాయాలు, ఇంట్లో తయారు చేసిన ప్రత్యేక మసాలా మిశ్రమంతో సికిందర్స్ భూంజా పేరుతో కాలక్షేపానికి, మందు బాబులకు స్టఫ్ గా  చిరుతిండిని అందిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ చిరుతిండికి జనం క్యూ కడతారు.. అంత టేస్టీగా ఉంటుంది.. అరారియాలో ప్రాంతంలో భూంజా ఈ చిరుతిండి తయారీ, అమ్మకంలో ప్రసిద్ది చెందాడు. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సికింద్రర్ బీఏ డిగ్రీ హోల్డర్.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక నానా ఇబ్బందులు పడ్డాడు.. తన అవసరాలు, కుటుంబ అవసరాలు తీరాలంటే.. ఏదో ఒక వ్యాపారం చేయాలనుకున్నాడు.. బాగా ఆలోచించి తక్కువ పెట్టుబడితో తన టాలెంట్ ను వినియోగించి భూంజా వ్యాపారాన్ని ప్రారంభించాడు. తన అభిరుచిని లాభదాయకమైన వ్యాపారంగా మార్చాడు. 

100 గ్రాముల భూంజా రూ.20 లకు విక్రయించబడే ఈ భూంజా.. బీహార్, ఉత్తరప్రదేశ్ అంతటా మంచి ఆదరణ పొందింది. రుచితో పాటు ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట. 
సికందర్ ఈ వ్యాపారంలో రోజుకు రూ. 2వేల 500 కంటే ఎక్కువగా సంపాదిస్తున్నాడు. వ్యాపారం బాగా అభివృద్ది చెందింది. స్థానిక మార్కెట్ లో సికిందర్ ఈ భూంజా వ్యాపారం అతన్ని ప్రముఖ వ్యక్తిగా నిలబెట్టింది. సికిందర్ వ్యాపారం పలువురికి ఆదర్శంగా నిలిచింది.