బరువు తగ్గాలనుకునే వారికి ఈ​ కాఫీ బెస్ట్!

బరువు తగ్గాలనుకునే వారికి  ఈ​ కాఫీ బెస్ట్!

పొద్దున్నే ఘుమఘుమలాడే బెడ్​ కాఫీ, సాయంత్రం రిలాక్స్​ అయ్యేందుకు ఒక కాఫీ.. రోజులో ఎన్నిసార్లు తాగినా ఫస్ట్​ టైం తాగుతున్న ఫీల్​ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది కాఫీ లవర్స్​కి. కానీ, మామూలు కాఫీ కంటే బ్లాక్​ కాఫీ తాగితే హెల్త్​కి మంచిది అంటున్నాయి స్టడీలు.
అమెరికా అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్​ (యుఎస్​డిఎ)​ రిపోర్ట్​ ప్రకారం ఒక కప్పు బ్లాక్​ కాఫీలో  రెండు క్యాలరీలు ఉంటాయట. అదే డి–కెఫినేటెడ్​ 
బీన్స్​తో చేసిందయితే దానిలో క్యాలరీలు అసలు ఉండవు. మామూలుగా కాఫీలో ఎక్స్​ట్రా ఫ్లేవర్ కోసం ​బెల్లం, చక్కెర, పాలు, వెనిల్లా, చాకొలెట్ సిరప్​ వంటివి వాడడం వల్ల700 క్యాలరీలు అవుతాయి. కాఫీలో ఉండే కెఫిన్​ బ్రెయిన్​, సెంట్రల్​ నెర్వస్​ సిస్టంను యాక్టివ్​గా ఉంచుతుంది. ఎనర్జీ లెవల్స్​ పెంచుతుంది. కాబట్టి బ్లాక్​ కాఫీని రోజువారీ డైట్​లో తీసుకోవచ్చు.  దానివల్ల తీపి కోసం బెల్లం, తేనె వంటివి మాత్రమే వాడతారు. దాంతో, క్యాలరీలు తగ్గుతాయి. 

ఈజీగా వెయిట్ లాస్​
బ్లాక్ కాఫీ బరువు త్వరగా తగ్గడానికి హెల్ప్​ అవుతుంది. దీనిలో ఉండే క్లోరోజెనిక్​ యాసిడ్​ అందుకు కారణం. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం తర్వాత ఒక కప్పు బ్లాక్​ కాఫీ తాగితే, ఇందులో ఉన్న ఆ యాసిడ్​, గ్లూకోజ్​, కొవ్వు కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. అంటే దానివల్ల క్యాలరీలు తగ్గినట్లే. రెగ్యులర్​గా వర్క్​వుట్స్​ చేసేవాళ్లయితే వర్కవుట్స్​కు ముందే బ్లాక్​ కాఫీ తాగడం మంచిది. దానివల్ల క్యాలరీలు బాగా ఖర్చవుతాయి. బ్లాక్​ కాఫీ శరీరంలో అదనంగా ఉన్న నీళ్లని యూరిన్​ ద్వారా బయటకు పంపుతుంది. ఇందులో ఉండే కెఫిన్​ వల్ల జీర్ణక్రియ సరిగా జరుగుతుంది. ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. దానివల్ల ఆకలి కూడా తగ్గుతుంది.  పైగా దీనివల్ల ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్​ ఉండవంటున్నారు ఎక్స్​పర్ట్స్​.