ఆకలితో అలమటించి.. కుక్క కళేబరాన్ని తిన్న బాధితుడు

ఆకలితో అలమటించి.. కుక్క కళేబరాన్ని తిన్న బాధితుడు

క‌రోనా నుంచి దేశాన్ని ర‌క్షించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం  లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వాలు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికి ..ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌ట్లేదు. కొద్దిరోజుల క్రితం బీహార్ లో ప‌ట్టెడు కూడు పెట్టే మనిషి లేక‌ ఆక‌లిని త‌ట్టుకోలేని   చిన్నారులు క‌ప్ప‌ల‌ను ఆహారంగా సేవించారు. హృదయ విదారకానికి మించేలా ఓ వ్యక్తి ఆకలికి తట్టుకోలేక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుక్క కళేబరాన్ని తినడం పలువుర్ని కంటతడి పెట్టిస్తోంది.

రాజస్థాన్ షాపురా ఢిల్లీ – జైపూర్ జాతీయ రహదారిపై ఆకలికి తట్టుకోలేని ఓ వ్యక్తి చనిపోయిన కుక్క కళేబరాన్ని తిన్నాడు.  అదే సమయంలో ఓ వాహనదారుడు కళేబరాన్ని ఎందుకు తింటున్నావని బాధితుణ్ని ప్రశ్నించగా ఆకలి తట్టుకోలేక తింటున్నట్లు చెప్పాడు. దీంతో వాహనదారుడు తన వద్ద ఉన్న అన్నం ప్యాకెట్ ఇచ్చాడు. కళేబరాన్ని తినకూడదని వారిస్తూ అక్కడి నుంచి వెళ్లి పోయాడు. ప్రస్తుతం హృదయవిదారక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.