ఇది ప్రారంభం మాత్రమే.. పెద్ది నుంచి మరిన్ని సర్ప్రైజ్లు

ఇది ప్రారంభం మాత్రమే.. పెద్ది నుంచి మరిన్ని సర్ప్రైజ్లు

మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా 2007లో ‘చిరుత’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. మగధీర, రంగస్థలం లాంటి సూపర్ హిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు  ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో  తెలుగులోనే కాదు   పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పాపులారిటీ దక్కించుకున్నాడు.  

ఆదివారం (సెప్టెంబర్ 28) తో చరణ్ ఇండస్ట్రీకి వచ్చి 18 ఏండ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ప్రస్తుతం తను నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసి చరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విషెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలియజేశాడు దర్శకుడు బుచ్చిబాబు. ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రగ్డ్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాసివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు చరణ్. 

ముక్కుకు పోగుతో బీడీ తాగుతూ రైల్వే ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  నిల్చొని  ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంది. ‘మన పెద్ది 18 సంవత్సరాల సినీ జీవితాన్ని జరుపుకుంటున్నారు.  తెరపై గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తూనే, బయట కూడా ఎంతో వినయంగా ఉంటూ హీరోల్లో తనకంటూ ఓ మార్గం ఏర్పాటు చేసుకున్నారు. ఇది ప్రారంభం మాత్రమే.. ‘పెద్ది’ నుంచి మరిన్ని సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రాబోతున్నాయి’ అని మూవీ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్  శరవేగంగా జరుగుతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, శివ రాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం  మార్చి 27 న విడుదల కానుంది.