హెల్దీ స్నాక్స్ గా ఇవి తీసుకుంటనే బెటర్

హెల్దీ స్నాక్స్ గా ఇవి తీసుకుంటనే బెటర్

సాయంత్రం పూట, ఆకలి వేసినప్పుడు శ్నాక్స్ తినడం మంచిదే. అయితే చాలామంది ఉప్పు, తీపి ఎక్కువ ఉండే ఫుడ్​ని శ్నాక్​గా తినేందుకు ఇష్టపడతారు. రుచిగా ఉన్నాయని వీటిని తరచూ తింటే శరీరంలో అదనంగా క్యాలరీలు చేరతాయి. ఫలితం.. బరువు పెరుగుతారు.  ఫిట్​నెస్  కూడా దెబ్బతింటుంది. కాబట్టి వీటి బదులు హెల్దీశ్నాక్స్ తినాలి అంటోంది న్యూట్రిషనిస్ట్ అజ్రా ఖాన్. 

తేలికగా ఉండి, తొందరగా అరిగే తామర గింజలు, దొడ్డు అటుకులు (మరమరాలు) శ్నాక్​గా బెస్ట్ ఛాయిస్. వీటిని నెయ్యిలో వేగించి తింటే ఆకలి తగ్గుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. శ్నాక్​గా అరటిపండు లేదా పిడికెడు నట్స్​, ఖర్జూరలు తింటే వెంటనే శక్తి వస్తుంది. ఇవేకాకుండా వేగించిన శనగలు,పాప్​కార్న్​ కూడా శ్నాక్​గా తినొచ్చు. అంతేకాదు క్యాలరీలు తక్కువ ఉండే వీటిని శ్నాక్​గా తినడం వల్ల బరువు కూడా పెరగరు.