
- బీఆర్ఎస్ను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్
హైదరాబాద్, వెలుగు: గేట్లు తెరవడంపై కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను ఉద్దేశిస్తూ సెటైరికల్ ట్వీట్ చేసింది. “గేట్లు తెరవడం అంటే.. మా ప్రభుత్వాన్ని కూలుద్దామని మీకు ఆలోచన వచ్చే లోపే.. మీ పార్టీ కుప్ప కూలిపోతుందని అర్థం.. చెరపకురా చెడేవు” అంటూ మంగళవారం ట్వీట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని, 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని బీఆర్ఎస్ నేతలు అంటుండగా, ఎంపీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పలుసార్లు వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కాంగ్రెస్ లో చేర్చుకొని ఫస్ట్ గేట్ తెరిచినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మీట్ ది ప్రెస్ లో వెల్లడించారు. అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని చేర్చుకున్నారు. త్వరలో మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేర నున్నట్లు తెలుస్తోంది.