ఓనమ్ విశేషాలు చెప్పిన అనుపమ పరమేశ్వన్

ఓనమ్ విశేషాలు చెప్పిన అనుపమ పరమేశ్వన్

త్రిస్సూర్: కరోనా లాక్ డౌన్ కారణంగా మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ కేరళ, త్రిస్సూర్ లోని సొంతింటికే పరిమితమైంది. సినిమా షూటింగులు లేకపోవడంతో అనుపమ ఇంటి పట్టునే సేదతీరుతోంది. మలయాళీలు ఘనంగా జరుపుకునే ఓనమ్ పండుగ రావడంతో గత 10 రోజుల నుంచి ఆమె ఫెస్టివల్ మూడ్ లోకి వెళ్లిపోయింది. కుటుంబంతో కలసి ఓనమ్ ను సెలబ్రేట్ చేసుకుంటోంది. ఓనమ్ సందర్భంగా త్వరలో అందరం కరోనా నుంచి బయట పడాలని కోరుకుంటున్నట్లు అనుమప చెప్పింది.

‘ప్రతి ఏడాది ఓనమ్ టైమ్ లో నేను షూటింగులతో బిజీగా ఉంటా. కానీ ఈసారి మాత్రం ఫెస్టివల్ ను ఫ్యామిలీతో కలసి జరుపుకునే చాన్స్ వచ్చింది. మొత్తానికి సెలబ్రేట్ చేసుకోవడానికి ఓనమ్ రూపంలో మంచి అవకాశం దక్కింది. అవిత్తంతో మొదలయ్యే ఓనమ్ తిరువోనమ్ తో ముగుస్తుంది. ఈ పది రోజుల్లో ఫ్లవర్ కార్పెట్స్ చేస్తాం. త్రిక్కాపరన్ స్టాట్యూను మట్టితో చేస్తాం. మా ఇంటిని నేనే శుభ్రం చేస్తున్నా. మామూలుగా మేం గుళ్లకు వెళ్లి స్నేహితులను కలుసుకుంటాం. కానీ ఈయేడు ఇంట్లోనే జరుపుకుంటున్నాం. నా పొరుగింటి వాళ్లు ఓనమ్ జరుపుకోవట్లేదు. దీంతో వారిని మా ఇంటికి ఇన్వైట్ చేశా. ఓనమ్ రోజున పొద్దున్నే లేచి ఇంట్లో పూజలు చేస్తాం. ఓనమ్ లో బెస్ట్ పార్ట్ అంటే ఫుడ్ అనే చెప్పాలి. బ్రేక్ ఫాస్ట్ కోసం ఇలా అడా, ఉడకబెట్టిన అరటి పండ్లతో బనానా చిప్స్ అసలు ఆ కాంబినేషన్ సూపర్బ్ గా ఉంటుంది. లంచ్ కోసం మా అమ్మ సాధ్యాను పాయసంతో సిద్ధం చేస్తుంది’ అంటూ అనుమప పండుగ ముచ్చట్లను పంచుకొంది.