ట్రై సైకిల్ పై ఫుడ్ డెలివరీ.. హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు

ట్రై సైకిల్ పై ఫుడ్ డెలివరీ.. హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు

ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇంటర్నెట్‭లోకి వచ్చేసింది. ఎక్కడెక్కడ జరిగే వింత విశేషాలు ఇక్కడే తెలుస్తున్నాయి. నిజానికి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అంగవైకల్యం అడ్డుకాదని ఓ యువకుడు నిరూపించాడు. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే చాలని మరోసారి రుజువు చేశాడు. అంగవైకల్యం ఉన్న ఓ కుర్రాడు జొమాటో డెలివరీ ఏజెంట్‭గా పనిచేస్తున్నాడు. నడవడానికి రెండు కాళ్లు సహకరించకపోయినా.. ట్రై సైకిల్‭ను ఆధారంగా చేసుకుని ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. తనను తాను పోషించుకుంటూ ఇంట్లో వాళ్లను చూసుకుంటున్నాడు. ట్రాఫిక్‭లో కూడా సునాయాసంగా వెళ్తూ చూసేవారిని ఆశ్యర్యపరిచాడు. అతడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అంగవైకల్యం ఉన్న యువకుడు ఫుడ్‭ను డెలివరీ కోసం తీసుకువెళ్తున్నాడు. అతడిని చూసిన ఓ నెటిజెన్ కెమెరాతో పలుకరించాడు. అది చూసి ఆ యువకుడు తన ముఖంలో ఆనందంతో చేయి చూపించాడు. వీరిద్దరి సంభాషణ విన్న నెటిజెన్లు జొమాటో డెలివరీ ఏజెంట్‭ను ప్రశంసిస్తున్నారు.