
స్పెషల్ సందర్భాలు వస్తే ఇంటరెస్టింగ్ అప్‌డేట్స్‌తో అభిమానుల్ని అలరించడం కామన్. వేలెంటైన్స్ డేకి ‘సర్కారువారి పాట’ టీమ్ కూడా ఓ సూపర్బ్ అప్‌డేట్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఆ మూవీ నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోంది. మహేష్ బాబు, కీర్తి సురేష్‌లపై తీసిన ఆ పాట ఎంత రొమాంటిక్‌గా ఉండబోతోందనేది ఓ స్పెషల్ స్టిల్‌ని విడుదల చేసి రుచి చూపించారు. బ్లూ జీన్స్, వైట్ హుడీలో మహేష్.. మోడర్న్ గాళ్ లుక్‌లో కీర్తి అట్రాక్ట్ చేస్తున్నారు. ప్రేమికుల రోజున రొమాంటిక్ ట్రీట్ గ్యారంటీ అని హింటిస్తున్నట్టుగా ఉన్నారు.