This Week OTT Movies: ఈవారం OTT సినిమాలు.. లిస్టులో టిల్లు స్క్వైర్, భీమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

This Week OTT Movies: ఈవారం OTT సినిమాలు.. లిస్టులో టిల్లు స్క్వైర్, భీమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రతీవారం లాగే మరో కొత్త వారం మొదలైంది. ఇటు థియేటర్స్ లో, అటు ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈవారం థియేటర్స్ లో మాత్రం పెద్దగా చెప్పుకునే సినిమాల రిలీజ్ లేదు. తమిళ హీరో విశాల్ హీరోగా వస్తున్న రత్నం, నారా రోహిత్ చేస్తున్న ప్రతినిధి 2 సినిమాలు ఈ వారం థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించనున్నాయి.

ఇక ఓటీటీల విషయానికి వస్తే.. ఈవారం కూడా చాలా సినిమాలు ఓటీటీ లవర్స్ ను ఎంటర్టైన్ చేయనున్నాయి. వాటిలో రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ టిల్లు స్క్వైర్, గోపీచంద్ హీరోగా వచ్చిన భీమా సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే డీటెయిల్స్ మీకోసం. 

హాట్‌స్టార్:

  • ఏప్రిల్ 25: భీమా (తెలుగు)
  • ఏప్రిల్ 26: థ్యాంక్యూ, గుడ్ నైట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్), క్రాక్ (హిందీ)

నెట్‌ఫ్లిక్స్:

  • ఏప్రిల్ 23: బ్రిగంటి (ఇటాలియన్ వెబ్ సిరీస్), ఫైట్ ఫర్ ప్యారడైజ్ (జర్మన్ వెబ్ సిరీస్)
  • ఏప్రిల్ 24: డెలివర్ మీ (స్వీడిష్ సిరీస్)
  • ఏప్రిల్ 25: సిటీ హంటర్ (జపనీస్ సినిమా), డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
  • ఏప్రిల్ 26: టిల్లు స్క్వేర్ (తెలుగు మూవీ), గుడ్ బాయ్ ఎర్త్ (కొరియన్ సిరీస్), ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్:

  • ఏప్రిల్ 25: దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్)

జియో సినిమా:

  • ఏప్రిల్ 22: ద జింక్స్ పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)  
  • ఏప్రిల్ 27: వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)