పండుగ సీజన్ అంటే చాలు వరుసగా సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంటాయి. స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న హీరోల దాకా పండుగ సీజన్ లో తమ సినిమాలను రిలీజ్ చేయాలని అనుకుంటారు. ఒకప్పుడు ఈ ట్రెండ్ కేవలం థియేటర్స్ లో మాత్రమే కనబడేది. కానీ, ఇప్పుడు ఓటీటీలు కూడా వరుసగా క్రేజీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ప్రతీవారం లాగే ఈవారం కూడా ఓటీటీలో కొత్త కంటెంట్ ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉంది. మరి ఆ సినిమాలేంటో? ఏ ఏ సినిమా ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్:
- ఏప్రిల్ 08: అన్‌ఫర్‌గాటన్ సీజన్-5(వెబ్ సిరీస్)
- ఏప్రిల్ 09: ది ఎక్సార్సిస్ట్: బిలీవర్(హారర్ మూవీ)
- ఏప్రిల్ 11: ఫాల్ అవుట్(అమెరికన్ సిరీస్)
- ఏప్రిల్ 12: ఎన్‌డబ్ల్యూఎస్‌ఎల్(అమెజాన్ ఒరిజినల్ సిరీస్)
నెట్‌ఫ్లిక్స్:
- ఏప్రిల్ 08: స్పిరిట్ రేంజర్స్- సీజన్- 3 (యానిమేటెడ్ సిరీస్)
- ఏప్రిల్ 09: నీల్ బ్రెన్నాన్: క్రేజీ గుడ్(స్టాండ్-అప్ కామెడీ స్పెషల్)
- ఏప్రిల్ 10: ఆంత్రాసైట్(వెబ్ సిరీస్), ది హైజాకింగ్ ఆఫ్ ఫ్లైట్ 601(వెబ్ సిరీస్), అన్‌లాక్డ్: ఏ జైల్ ఎక్స్‌పెరిమెంట్(డాక్యుమెంటరీ), జెన్నిఫర్ వాట్ డిడ్(రియల్ క్రైమ్ డాక్యుమెంటరీ)
- ఏప్రిల్ 11: యాజ్ ది క్రో ఫైల్స్- సీజన్ 3(వెబ్ సిరీస్), హార్ట్‌బ్రేక్ హై -సీజన్ 2(టీన్ వెబ్ సిరీస్), మిడ్ సమ్మర్ నైట్ -సీజన్1(థ్రిల్లర్ సిరీస్)
- ఏప్రిల్ 12: అమర్ సింగ్ చమ్కిలా (హిందీ సినిమా), గుడ్ టైమ్స్ -(యానిమేటెడ్ సిట్‌కామ్), లవ్ డివైడెడ్ - (రోమాంటిక్ కామెడీ), స్టోలెన్(స్వీడిష్ మూవీ)
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
- ఏప్రిల్ 12: ప్రేమలు(మలయాళ వర్షన్)
జీ5:
- ఏప్రిల్ 12: గామి(తెలుగు సినిమా)