V6 News

థామస్‌‌‌‌‌‌‌‌, ఉబెర్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు ఇండియా రెడీ

థామస్‌‌‌‌‌‌‌‌, ఉబెర్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు ఇండియా రెడీ

హార్సెన్స్‌‌‌‌‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌‌‌‌‌): ప్రతిష్టాత్మక థామస్‌‌‌‌‌‌‌‌, ఉబెర్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌కు ఇండియా బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ జట్లు రెడీ అయ్యాయి. శుక్రవారం నుంచి జరిగే ఈ పోటీల్లో మెన్స్‌‌‌‌‌‌‌‌ జట్టు మరోసారి ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా దిగుతుండగా, విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. 2022లో థామస్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ను నెగ్గిన మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ మరోసారి దాన్ని పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కెనడాతో తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడనున్న ఇండియా.. 27న ఆస్ట్రేలియాతో, 29న చైనాతో తలపడనుంది. యంగ్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ ఆయుష్‌‌‌‌‌‌‌‌ శెట్టి రాకతో టీమ్‌‌‌‌‌‌‌‌ బలం  బాగా పెరిగింది. 

ఇటీవల జరిగిన బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ ఆసియా చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరిన ఆయుష్‌‌‌‌‌‌‌‌తో పాటు లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌, డబుల్స్‌‌‌‌‌‌‌‌ జోడీ సాత్విక్‌‌‌‌‌‌‌‌–సాయిరాజ్‌‌‌‌‌‌‌‌పై భారీ ఆశలు ఉన్నాయి. కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌.ఎస్‌‌‌‌‌‌‌‌. ప్రణయ్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌పై కాస్త ఆందోళన నెలకొని ఉంది. ఉబెర్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు కఠిన సవాల్‌‌‌‌‌‌‌‌ ఎదురుకానుంది. డెన్మార్క్‌‌‌‌‌‌‌‌, ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌, చైనాతో గట్టి పోటీ ఎదురుకానుంది. గాయం కారణంగా ట్రీసా జోలీ–గాయత్రి గోపీచం ద్‌‌‌‌‌‌‌‌ ఈ టోర్నీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో పీవీ సింధు నాయత్వంలోని జట్టుపై భారీ బాధ్యత ఉంది. తన్వీ శర్మ, దేవిక సిహాగ్‌‌‌‌‌‌‌‌, ఉన్నతి హుడా, ఇషా రాణి యంగ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు కీలకం కానున్నారు. సింధు ఫామ్‌‌‌‌‌‌‌‌ కూడా ఇబ్బందికరంగా కనిపిస్తోంది.