శబరిమలకు పోటెత్తిన భక్తులు

శబరిమలకు పోటెత్తిన భక్తులు

శబరిమల: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం నిర్వహిం చిన మొదటి మండల పూజకు వేలాదిగా  హాజరయ్యారు. కేరళ తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. గంటల కొద్దీ క్యూలైన్లలో నిల్చొని స్వామిని దర్శించుకున్నారు.ప్రధాన పూజరి కందరారు మహేశ్​ మోహనరు అయ్యప్పను పవిత్ర వస్త్ర ంతో అలంకరించారు. ప్రత్యేక పూజలు కలభంహిషేకం, కలశాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకకు నాగాలాండ్ గవర్నర్ ఎల్. గణేశ్, కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె. రాధా కృష్ణన్, ఎమ్మెల్యే జెనీష్​ కుమార్,  దేవస్థానం బోర్డ్ ప్రెసిడెంట్ పిఎస్. ప్రశాంత్​, ఉన్నతాధికారులు హాజరయ్యారు.