- ఐఏఎస్ ఆఫీసర్ అంటూ ఫోన్లలో వార్నింగులు
- ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందని హెచ్చరికలు
- పోచారం కమిషనర్ నిత్యానంద్ ఆవేదన
ఘట్కేసర్, వెలుగు: లక్షల్లో ప్రాపర్టీ టాక్స్ఎగవేస్తున్న వారి దగ్గరకు పోతే బెదిరింపులు ఎదురవుతున్నాయని, కొందరైతే తమను లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్కమిషనర్ నిత్యానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పోచారం మున్సిపల్ పరిధిలోని శ్రీనిధి కాలేజీ, రాక్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూలు యాజమాన్యాలు ప్రాపర్జీ ట్యాక్స్కట్టలేదని, అడగడానికి వెళ్తే ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ ల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారని ఆరోపించాడు. ఆస్తి పన్ను కట్టాలని నోటీసులు పంపిస్తే ఐఏఎస్ఆఫీసర్అంటూ ఒకరితో కాల్చేయించి భయపెట్టాలని చూశారని చెప్పారు. కాలేజీ, స్కూల్స్‌లో పెద్ద పెద్ద వారు ఉన్నారని, ట్యాక్స్కట్టాలని ఒత్తిడి చేస్తే తన ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందని అంటున్నారని వాపోయాడు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌తో పాటు సీడీఎంఏ అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.
