- 75 మందికి అస్వస్థత.. అపస్మారకస్థితిలో ఇద్దరు
- భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలింపు
- ఏపీలోని ఎటపాక మండలం గొల్లగుప్పలో ఘటన
భద్రాచలం, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని ఏపీలో విలీనమైన ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో క్లోరోక్విన్ టాబ్లెట్లు మింగి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మరో ఇద్దరు చిన్నారు లు అపస్మారక స్థితిలోకి వెళ్లాగా.. 75 మంది అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో పద్దం రోజా, మడివి జమునతో పాటు మరో చిన్నారి మరణించారు.
గ్రామంలో చిన్నారులు అనారోగ్యానికి గురవడంతో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో అనారోగ్య బాధితులను పరీక్షించిన డాక్టర్లు క్లోరోక్విన్ టాబ్లెట్లను పంపిణీ చేశారు. అయితే, వాటిని తీసుకున్న సుమారు 75 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. కొందరి పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే ఎటపాక మండలంలోని లక్ష్మీపురం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అనంతరం అందులో కొందరిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్అందిస్తున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా అక్కడి డాక్టర్లతో పాటు పలువురు సీనియర్ డాక్టర్లను కూడా ఆస్పత్రికి రప్పిస్తున్నారు. చిన్నారులకు జ్వరం కారణంగానే ఈ టాబ్లెట్లు ఇచ్చారా? లేక ఇతర అనారోగ్య కారణాలేమైనా ఉంటే ఇచ్చారా? అనే కోణాల్లో డార్టర్లు విశ్లేషిస్తున్నారు.
