పగ పడితే మనిషి ఎంత భయంకరంగా ఉంటాడని పురాణాల్లో విన్నాం, చాలా సినిమాల్లో చూశాం. పగ, ప్రతీకారాల కోసం కుటుంబాలకు కుటుంబాలే నాశనమైన ఘటనలు కూడా చాలా చూశాం. ఇది మాత్రం సినిమాని మించిన స్టోరీ... ఓ కుటుంబం 20 ఏళ్లుగా ఎదురుచూసి మరీ... పగ తీర్చుకుంది. తమ తండ్రి మరణం చుసిన 20 ఏళ్ళ తర్వాత సమయం కోసం ఎదురుచూసి ప్రత్యర్థిని హతమార్చారు కుటుంబసభ్యులు. ఏపీలోని గుంటూరులో జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
20 ఏళ్ళ క్రితం గుంటూరులోని కేవీపీ కాలనీలో చిన్నా అనే వ్యక్తి నివసించేవాడు. అదే కాలనీకి చెందిన బుల్లయ్య, చిన్నా భార్యతో చనువుగా ఉంటున్నాడన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొద్దీ రోజులకే బుల్లయ్య హత్యకు గురయ్యాడు. ఈ హత్య చేసింది చిన్నానే అని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కాలంలో కేసు కొట్టేశారు.
బుల్లయ్య ఫ్యామిలీ తనను టార్గెట్ చేసినట్లు సమాచారం అందండంతో అక్కడ నుండి తెలంగాణలోని సూర్యాపేటకు మకాం మార్చాడు చిన్నా. అక్కడే గత ఇరవై ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. అయితే చిన్నా కోసం బుల్లయ్య కుటుంబ సభ్యులు 20 ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు.
►ALSO READ | వైజాగ్ నుంచి హైదరాబాద్కు గంజాయి.. కుత్బుల్లాపూర్ పాత గవర్నమెంట్ కాలేజీ దగ్గర ఇద్దరు అరెస్టు
రెండు రోజుల క్రితం కేవీపీ కాలనీలో ఉండే చిన్నా బాబాయ్ చనిపోచనిపోయాడు... ఈ క్రమంలో చిన్నా కచ్చితంగా వస్తాడని భావించిన బుల్లయ్య కుటుంబ సభ్యులు పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. బాబాయ్ మృతదేహాన్ని చూసిన తర్వాత.. చిన్నా టీ తాగేందుకు రోడ్డుకుపైకి వచ్చాడు. అదే సమయంలో రంగంలోకి దిగిన బుల్లయ్య ఫ్యామిలీ మెంబర్స్ నడిరోడ్డుపైనే చిన్నాను దారుణంగా నరికి హత్య చేశారు. పట్టపగలే హత్య జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
