- సబలెంక, స్వైటెక్, నోస్కోవా
- షెల్టన్, తియాఫో, సిట్సిపాస్ కూడా..
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్ ప్లేయర్లు సాఫీగా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో రెండోసీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 6–4, 6–4, 6–4తో రోమన్ సఫియుల్లిన్ (రష్యా)పై అలవోగా గెలిచాడు. కుడి మణికట్టు గాయంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆటకు దూరంగా ఉన్న అల్కరాజ్ తొలి మ్యాచ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడాడు. రెండు గంటలా 22 నిమిషాల మ్యాచ్‌లో అల్కరాజ్ సర్వీస్‌ల్లో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో 2 ఏస్‌లు, 5 డబుల్ ఫాల్ట్స్ చేసిన స్పెయిన్ ప్లేయర్ తన సర్వీస్‌లో 68 శాతం పాయింట్లు రాబట్టాడు.
ఏడు బ్రేక్ పాయింట్లలో నాలుగింటిని కాచుకున్నాడు. 28 విన్నర్లు, 27 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 9 ఏస్‌లు, 4 డబుల్ ఫాల్ట్స్ చేసిన సఫియుల్లిన్ సర్వీస్‌ల్లో ఇబ్బందిపడ్డాడు. ఒకే ఒక్క బ్రేక్ పాయింట్‌ను కాపాడుకున్న సఫియుల్లిన్ 36 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో బెన్ షెల్టన్ (అమెరికా) 1–6, 6–1, 7–6 (7/3), 6–2తో గ్రీక్స్‌పూర్ (నెదర్లాండ్స్)పై , అగుర్ (కెనడా) 7–5, 4–6, 6–3, 7–5తో హిజికటా (ఆస్ట్రేలియా)పై, ఫ్రాన్సెస్ తియాఫో (అమెరికా) 6–4, 4–6, 3–6, 6–3, 6–4తో డామ్ (అమెరికా)పై, నకసింహా (అమెరికా) 6–2, 6–1, 6–0తో బీజ్ (అర్జెంటీనా)పై, టియెన్ (అమెరికా) 6–4, 6–1, 6–2తో బోర్జెస్ (పోర్చుగల్)పై, రబ్లెవ్ (రష్యా) 6–7 (5/7), 6–7 (0/7), 6–0, 6–2, 7–6 (10/5)తో ఒర్టో విర్టానెన్ (ఫిన్లాండ్)పై గెలవగా, సిట్సిపాస్ 4–6, 7–6 (7/3), 6–1, 6–4తో పదోసీడ్ ఆర్థర్ ఫ్లిస్ (ఫ్రాన్స్)కు, బెరెటెనీ (ఇటలీ) 7–6 (7/4), 7–6 (7/3, 6–0)తో వావ్రింకా (స్విట్జర్లాండ్)కు షాకిచ్చారు.
సబలెంక సాఫీగా..
విమెన్స్ సింగిల్స్‌లో టాప్‌సీడ్ అరీనా సబలెంక (బెలారస్) 6–2, 6–4తో కామిల్లా ఒసోరియో (కొలంబియా)పై, నోస్కోవా (చెక్) 7–5, 6–1తో వాలీనెట్స్ (అమెరికా)పై, ఒసాక (జపాన్) 7–6 (8/7), 7–6 (7/3)తో జకరోవా (రష్యా)పై, అన్సిమోవా (అమెరికా) 6–1, 6–3తో క్రుగెర్ (అమెరికా)పై, స్వైటెక్ (పోలెండ్) 6–2, 6–3తో వాంగ్ (చైనా)పై, ముచోవా (చెక్) 6–3, 6–0తో సింజా క్రాస్ (ఆస్ట్రియా)పై, ఎమ్మా నవారో (అమెరికా) 7–6 (8/6), 6–7 (1/7), 6–3తో లూయిస్ బోసిన్ (ఫ్రాన్స్)పై, టౌన్సెండ్ (అమెరికా) 6–2, 6–3తో మజా చౌలిన్‌స్కా (పోలెండ్)పై, క్విన్వెన్ జెంగ్ (చైనా) 4–6, 6–3, 6–1తో లియుటోవా (రష్యా)పై, స్టీఫెన్స్ (అమెరికా) 6–4, 6–1తో క్లారా టౌసన్ (డెన్మార్క్)పై, కలిన్‌స్కయా (రష్యా) 6–4, 6–3తో బ్లింకోవా (రష్యా)పై, ష్నైడెర్ (రష్యా) 6–0, 6–4తో డారియా స్నిగుర్ (ఉక్రెయిన్)పై, జోయింట్ (ఆస్ట్రేలియా) 3–6, 6–2, 6–2తో సమసనోవా (రష్యా)పై, సినియాకోవా (చెక్) 6–3, 6–2తో ఎలిసాబెట్టా కొకోరియోటా (ఇటలీ)పై గెలిచి ముందంజ వేశారు.
