- కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి
హసన్ పర్తి, వెలుగు: కిడ్నాపర్ల చెర నుంచి ముగ్గురు చిన్నారులను రక్షించామని.. ఎవరైనా గుర్తు పడితే సమాచారం ఇవ్వాలని హనుమకొండ జిల్లా కాజీపేట కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి కోరారు. గురువారం ముగ్గురు పిల్లల ఫొటోలను రిలీజ్ చేసి మాట్లాడారు. చిన్నారులను అపహరించి, విక్రయిస్తున్న ముఠాను గత జనవరిలో కాజీపేట రైల్వే స్టేషన్ పరిసరాల్లో టాస్క్ ఫోర్స్, కాజీపేట పోలీసులు అరెస్ట్చేశారని తెలిపారు. వారి వద్ద నుంచి రక్షించిన ఏడుగురు పిల్లల్లో నలుగురిని తల్లిదండ్రులకు అప్పగించామన్నారు.
మరో ముగ్గురు చిన్నారుల పేరెంట్స్సమాచారం తెలియకపోవడంతో ప్రస్తుతం శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో ఉంచామని చెప్పారు. ఆరేండ్ల వయసున్న బాబును 2023 అక్టోబర్ లో కాజీపేట రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్పైనుంచి, 7 నెలల పాపను 2025 అక్టోబర్ లో మంచిర్యాల రైల్వేస్టేషన్ పరిసరాల నుంచి, 5 నెలల పాపను రామగుండం రైల్వేస్టేషన్ పరిసరాల నుంచి ఎత్తుకెళ్లినట్లు నిందితులు చెప్పారన్నారు. ఈ పిల్లలను ఎవరైనా గుర్తుపడితే కాజీపేట సీఐ ఫోన్నంబర్ 87126 85122 లో సంప్రదించి, తగిన ఆధారాలు చూపించి తీసుకెళ్లాలని సూచించారు.
