
సంగారెడ్డి: సంగారెడ్డి హనుమాన్ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ క్వారీ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులు కృష్ణా(9), నివర్తి(12), సందేశ్(9)లుగా గుర్తించారు. అప్పటివరకు ఆడుకుంటూ ఉన్న చిన్నారులు శవమై కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు తల్లిదండ్రులు. సమాచార అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.