నా ఫాలోవర్లు నన్ను మరిచిపోతారేమో..కరోనా సోకిన మహిళ టిక్ టాక్ వీడియో

నా ఫాలోవర్లు నన్ను మరిచిపోతారేమో..కరోనా సోకిన మహిళ టిక్ టాక్ వీడియో

నా ఫాలోవర్లు నన్ను మరిచిపోతారేమోనని ఆందోళనకు గురైన కరోనా సోకిన బాధితురాలు టిక్ టాక్ వీడియో చేసింది. తమిళనాడులో అరియలూరు గవర్నమెంట్ ఆస్పత్రిలో కరోనా సోకిన బాధితురాలు టిక్ టాక్ చేయడం కలకలం రేపుతుంది. ఐసోలేషన్ వార్డ్ లో సెల్ ఫోన్ కు అనుమతి లేదు. అయినా అక్కడ పనిచేసే పారిశుద్ద్య సిబ్బంది సాయంతో ఐసోలేషన్ వార్డ్ లోకి సెల్ పోన్ తెప్పించుకుంది. సిబ్బంది బాధిత మహిళ టిక్‌టాక్‌ చేస్తుండగా సెల్‌ఫోన్‌లో తీశారు. అనంతరం ఆమెతో సెల్ఫీ దిగారు. ఆ టిక్ టాక్ వీడియో వెలుగులోకి రావడంతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు బాధిత మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసొలేషన్‌ వార్డులో సెల్‌ఫోన్‌కు అనుమతి లేకపోయినా మహిళకు సెల్ ఫోన్ ఎవరిచ్చారంటూ విచారణ చేపట్టారు. విచారణలో బాధితురాల సెల్ ఫోన్ కావాలంటూ తమని ఇబ్బంది పెట్టిందని, అందుకే సెల్ ఫోన్ ఇచ్చామని పారిశుద్ధ్య సిబ్బంది చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నిబంధనలకు విరుద్దంగా బాధిత మహిళకు సహకరించారంటూ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. అనంతరం వారిని క్వారంటైన్‌కు తరలించారు.