వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లెమోనిగూడలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఒకేసారి మూడు ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. బుధవారం ( జనవరి 21 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లెమోనిగూడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రసూల్ బి, బషీర్ బి, మౌలానా అనే వ్యక్తుల ఇళ్లు ఒకేసారి అగ్నికి ఆహుతయ్యాయి. బాధితులు పొలం పనులకు వెళ్లిన సమయంలో మంటలు చెలరేగడంతో ఇళ్లలోని సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది.
ఈ ప్రమాదంలో రెండు మేక పిల్లలు సజీవ దహనమయ్యాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ వారు వచ్చేలోపే సర్వం బూడిదయ్యాయి. నిలువనీడ కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు.
►ALSO READ | రాజకీయ ప్రయోగశాలగా సింగరేణి.. బొగ్గు అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలి: కిషన్ రెడ్డి
మొదట ఓ ఇంట్లో మొదలై... మూడు ఇళ్ళకు పాకినట్టు తెలుస్తోంది. ఇళ్ళు పూర్తిగా దగ్దమవ్వడంతో బాధితులకు ఉండటానికి గూడు లేని పరిస్థితి ఏర్పడింది. నిలువ నీడ కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు బాధితులు.
