ఢిల్లీ: సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపిం చారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ విధ్వంసం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. నైనీ కోలి విషయంలో కేంద్రం సహకారం అంది స్తోందన్నారు. ఢిల్లీలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ 'సింగరేణిని అన్ని రకాలుగా విధ్వంసం చేశారు.
బీఆర్ఎస్ ఎలా పనిచేసిందో కాంగ్రెస్ అలానే పనిచేస్తుంది. ఒడిశాలో బీజేపీ వచ్చాక అక్కడి ప్రభుత్వంతో అనుమతులపై చర్చించాను. నైనీ బొగ్గు గనులకు చివరి పర్మిషన్ వచ్చాక పనులు ఎందుకు ఆలస్యం చేశారు? బీఆర్ఎస్ హయాంలోనూ అనేక అక్రమాలు జరిగాయి.
ఆరోజు కొందరు వ్యక్తులకు లాభంగా చేకూరేలా వ్యవహరించారు. సింగరేణి అక్రమాలపై సీబీఐదర్యాప్తు జరగాలి. రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుంది. సింగరేణి మైనింగ్కు ముందుకు వస్తే, చెయ్యలేమని ప్రైవేట్ కు కట్టబెట్టారు. సంస్థని బెదిరించి లేఖ రాయించారు. ఈ వివా దంలోకి నన్ను కూడా లాగుతున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది? సింగరేణి భవిష్యత్ను ప్రమాదకరంగా మార్చారు. సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి' అని అన్నారు.
