హైదరాబాద్ చిక్కడపల్లిలో ఫైనాన్స్ వ్యాపారి గజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి… వారి నుంచి 35 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
హైదరాబాద్ లో ఆటోమొబైల్ ఫైనాన్స్ చేస్తున్న గజేంద్ర ప్రసాద్‌ను కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారు. దోమల్ గూడ నుంచి అతడ్ని దుండగులు తీసుకెళ్లి… మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. గజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు నుంచి కోటి రూపాయలు తీసుకొని …అబీడ్స్ దగ్గర డబ్బులు కలక్ట్ చేసుకున్న కిడ్నాపర్లు గజేంద్ర ప్రసాద్ ను వదిలిపెట్టారని తెలిపారు పోలీసులు.
గజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. ఇవాళ ఐదుగురు కిడ్నాపర్లలో ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.
ఫైనాన్స్ వ్యాపారం కారణంగానే గజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కార్ ఫైనాన్స్ లో భారీగా నగదు బదిలీలు జరుగుతున్నట్లు గ్యాంగ్ లీడర్ అల్మాస్ కు ముందే తెలుసని అందుకే కిడ్నాప్ చేశారని తెలిపారు. అంతేకాదు… కార్ల బిజినెస్ లో ఆల్మస్ కి, గజేంద్ర ప్రసాద్ కు గతంలో పరిచయం ఉందన్నారు.
