నారాయణఖేడ్పట్టణంలోని ‘నారాయణి’ లక్కీ డ్రాలో ముగ్గురికి కార్లు

నారాయణఖేడ్పట్టణంలోని ‘నారాయణి’ లక్కీ డ్రాలో ముగ్గురికి కార్లు

నారాయణ్ ఖేడ్ వెలుగు: నారాయణి మెగా షాపింగ్ మాల్ బ్రాంచిలలో 3 నెలలుగా రూ.999 విలువైన దుస్తులు కొనుగోలు చేసిన కస్టమర్లలో ముగ్గురికి బుధవారం లక్కీ డ్రా ద్వారా కార్లు అందజేశారు. నారాయణఖేడ్ ​పట్టణంలోని రాజీవ్​చౌక్​బ్రాంచిలో నిర్వహించిన డ్రాలో నారాయణఖేడ్ మండలంలోని నమ్లి మెట్ గ్రామానికి చెందిన చంద్రకళ, బసవేశ్వర చౌక్ బ్రాంచిలో తీసిన డ్రాలో పట్టణానికి చెందిన బిరాదర్ ఆర్తి, జోగిపేట్ బ్రాంచిలో నిర్వహించిన డ్రాలో గంజి శివకుమార్–పల్లవి దంపతులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు సంతోషం వ్యక్తం చేశారు. 

విజేతలకు నారాయణి షాపింగ్ మాల్ ఓనర్స్ అనంతం అండ్​బ్రదర్స్ కార్ల తాళాలు అందజేశారు. కార్యక్రమంలో యూట్యూబర్ సుష్మ భూపతి, ఇన్​స్టాగ్రామ్ జగదీశ్, పట్టణ ప్రజలు, షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు.