గచ్చిబౌలి, వెలుగు: ఆల్ ఇండియా పోలీస్డ్యూటీ మీట్–2023లో సైబరాబాద్ పోలీసులు ప్రతిభ కనబర్చారు. 2 గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్మెడల్ సాధించారు. మెడల్స్సాధించిన పోలీస్అధికారులను సైబరాబాద్సీపీ అవినాష్‌మహంతి సోమవారం తన ఆఫీసులో అభినందించారు. యూపీ రాజధాని లక్నోలోని రైల్వే పోలీస్ అకాడమీలో ఈ నెల12 నుంచి 16వ తేదీ వరకు జరిగిన 67వ ఆల్ ఇండియా పోలీస్డ్యూటీ మీట్లో సైబరాబాద్సీఏఆర్ హెడ్‌క్వార్టర్‌కు చెందిన ఏఆర్‌హెడ్ కానిస్టేబుల్దేవేంద్ర ప్రసాద్ పాల్గొని పోలీస్ఫొటోగ్రఫీలో గోల్డ్ మెడల్ సాధించారు. ఇదే డిపార్ట్మెంట్లోని బాంబ్ డిస్పోజల్ టీంకు చెందిన ఏఆర్హెడ్కానిస్టేబుల్రామకృష్ణరెడ్డి యాంటీ సాబోటేజ్ చెక్ విభాగం గ్రౌండ్ సర్చ్‌లో గోల్డ్ మెడల్పొందారు. మదాపూర్ఎస్సైగా పనిచేస్తున్న రమణ సైంటిఫిక్ఐడ్స్ టూ ఇన్వెస్టిగేషన్విభాగం–10 ఫొటోగ్రఫీలో సిల్వర్ మెడల్ సాధించారు.

