
జీడిమెట్ల, వెలుగు: జల్సాలు, ఇతర అవసరాల కోసం చైన్స్నాచింగులకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి శుక్రవారం వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా అన్నారానికి చెందిన మస్కూరీ అరుణ్‌కుమార్(28) మూడు సంవత్సరాల క్రితం బ్యాంక్‌లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు.
ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 3న మధ్యాహ్నం 3 గంటల సమయంలో సూరారం పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్‌గాంధీనగర్‌లో ఓ మహిళ మెడలోంచి పుస్తెల తాడు లాక్కొని పారిపోయాడు. కొంపల్లికి చెందిన తూళ్ల నిరంజన్ రెడ్డి(27) ఆన్ లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు.
ఈ నెల 7న మచ్చబొల్లారం, సిద్ధివినాయక్నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మమ్మ మెడలో రెండు తులాల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన నీరుడు భూమయ్య(21) చింతల్లో నివాసముంటూ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు.
జల్సాలకు అలవాటు పడి దొంగతనాలను ఎంచుకున్నాడు. గాగిల్లాపూర్, నారాయణాద్రి లేఅవుట్లో ఇంటివద్ద ఉన్న ఓ మహిళ మెడలోంచి 2.5 తులాల పుస్తెలతాడు దొంగలించాడు. ఈ ముగ్గురు నిందితులను శుక్రవారం వేర్వేరుగా పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.